‘పెద్ది’ ప్లేస్ లో ‘ఉస్తాద్’.. మైత్రీ ప్లాన్ అదుర్స్!

by | Jan 24, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’(Peddi). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇక రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కానుకగా మార్చి 27 న పెద్ది రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ఈ మూవీ షూటింగ్ చేస్తూనే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్టాఫ్ ను లాక్ చేసిన మేకర్స్ రీరికార్డింగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ వద్దకు పంపించారు. అయితే ఇంకా సెకండాఫ్ లో చాలా భాగం షూటింగ్ పూర్తి చేయాలి.. అనంతరం అందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చెయ్యాలి. అందుకే ‘పెద్ది’ (Peddi) చిత్రాన్ని మార్చిలో కాకుండా జూన్ లో విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమా వాయిదా పడితే, అదే తేదీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)(హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) చిత్రాన్ని విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎలాంటి పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, గబ్బర్ సింగ్ కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ జోడిగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం అన్ని పనులను వేగంగా పూర్తి చేసుకుంటోంది.