నార్త్ అమెరికాలో ‘ మన శంకర వర ప్రసాద్ గారి’ ప్ర‌భంజ‌నం

by | Jan 24, 2026 | సినిమా

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ.84 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మెగా మూవీ ఇప్పటివరకూ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సత్తా చాటింది. $3.2 మిలియన్ గ్రాస్ వసూలు చేసి, స్ట్రాంగ్ హోల్డ్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi) కెరీర్ లో తొలిసారిగా $3 మిలియన్ క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు చిరు ఓవర్సీస్‌లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ ($2.7 మిలియన్లు) ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) వెనక్కినెట్టింది. ఇక ఓవర్సీస్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 20కి పైగా సింగిల్ స్క్రీన్స్ లలో ఈ సినిమా కోటికి పైగా గ్రాస్ వసూళ్లని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండో వారంలోనూ కలెక్షన్ల పరంగా నిలకడను చూపిస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ ముగిసేనాటికి భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల (Sushmitha Konidela) ఈ చిత్రాన్ని నిర్మించారు.