భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య రాయపూర్ లో జరుగుతోన్న రెండవ టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
ధాటిగా ఆడే క్రమంలో న్యూజిలాండ్ చేజేతులా వికెట్లను పారేసుకుంది. 27 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సాంట్నర్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. వన్ డౌన్ లో వచ్చిన రచిన్ రవీంద్ర 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు.
కాన్వే 19 పరుగులు, సీఫెర్ట్ 24 పరుగులు, ఫిలిప్స్ 19 పరుగులు, మిచెల్ 18 పరుగులు, చాప్ మన్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివర్లో లోయర్ ఆర్డర్ బాట్స్ మన్ ఫోక్స్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 8 బంతుల్లో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
భారత జట్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, శివమ్ దూబే, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి లు తలా ఒక వికెట్ తీశారు

