మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా, దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు చిరు తదుపరి చిత్రాలపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చిరంజీవి లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’(Viswambhara) దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (keeravani) సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా, కథా పరంగా విజువల్ పరంగా కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే సినిమాను వేసవిలో కాకుండా, ఈ ఏడాది జూలైకి వాయిదా వేసి మరింత మెరుగైన అవుట్‌పుట్‌ను అందించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫాంటసీ కాన్సెప్ట్ కావడంతో వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే విశ్వంభర (Viswambhara) చిత్రాన్ని జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది.

