తెలుగు చిత్రసీమలో టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో బ్యూటీ క్వీన్ పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మంగళవారం’. (Mangalavaram) 2023 నవంబరు 17న విడుదలైన ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ నటనకి ప్రశంసల వర్షం కురిసింది. ప్రియదర్శి ఇందులో కథానాయకుడిగా నటించాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు దర్శకుడు అజయ్ భూపతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం మూవీ సీక్వెల్‌లో పూర్తిగా కొత్త కథ ఉంటుందని, అందుకే పాయల్ రాజ్‌పుత్ కాకుండా మరో హీరోయిన్‌తో ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు అజయ్ భూపతి ఉన్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఈ క్రేజీ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీలను (Sree Leela) హీరోయిన్ గా తీసుకోవాలని అజయ్ భూపతి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శ్రీలీలను కలిసిన దర్శకుడు అజయ్ భూపతి స్క్రిప్ట్ మొత్తం వినిపించగా ఇందుకు శ్రీలీల కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం సినిమా తొలి భాగం తరహాలోనే ఇందులో కూడా హీరోయిన్ గ్రామీణ ప్రాంత యువతి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉంటే.. టాలీవుడ్ లో హీరోయిన్ గా శ్రీలీల ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నితిన్‌తో ‘రాబిన్ హుడ్’ సినిమాతో పాటుగా రవితేజతో ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’ సినిమా చేస్తున్న శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

