యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ (Dragon) అనే క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth( హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జోర్డాన్‌లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ పూర్తైన వెంటనే ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల కాకముందే ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ రేటుకు దక్కించుకుందట. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా హక్కులు రూ. 125 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ డీల్ ప్రకారం డ్రాగన్ థ్రియాట్రికల్ రిలీజైన 8 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమాకి వారు అంత మొత్తంలో డీల్ ఇచ్చినప్పటికీ సినిమా థియేట్రికల్ కలెక్షన్స్ మీద కూడా ఇది ఆధారపడి ఉండొచ్చని తెలుస్తోంది. ఒకవేళ సినిమా అంచనాలు అందుకోకుంటే ఈ ధర తగ్గొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన తర్వాత, థియేటర్లలో ఫలితం తేడా వస్తే ఓటీటీలకు భారీగా నష్టం జరుగుతుంది. అందుకే ఓటీటీ సంస్థలు ఇప్పుడు థియేట్రికల్ కలెక్షన్స్ ఆధారంగానే ఓటీటీ డీల్స్ చేస్తున్నాయి. సినిమా థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంటేనే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ధర చెల్లిస్తారు. మిశ్రమ స్పందన లభిస్తే మాత్రం ధర తగ్గుతుంది. ఈ నిబంధన మీదే డ్రాగన్ మూవీ ఓటీటీ డీల్ ఫైనల్ చేసినట్లుగా సమాచారం.

