మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా డైరెక్టర్ అనీల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద తన జోరు చూపిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్లో చేరింది. ముఖ్యంగా రెండో వారంలోనూ జోరు కొనసాగిస్తోంది. వీకెండ్ అయిన శనివారం నాడు ఏకంగా లక్ష టికెట్లు బుక్‌మైషోలో అమ్ముడుపోయాయి. ఆపై రిపబ్లిక్ డే హాలిడే ఉంటుంది కాబట్టి ఈ రెండురోజులు థియేటర్స్ ఫుల్ కానున్నాయి. మన శంకర వరప్రసాద్‌గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ రూ. 450 కోట్ల వరకు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మేకర్స్ ఆనందంగా ఉన్నారు.
ఇదిలావుంటే.. మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy) ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్(Venkatesh), కింగ్ నాగార్జున(Nagaruna) లతోపాటు ప్రముఖ వైద్యుడు డా.గురవారెడ్డి (Gurava Reddy) తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను గురవారెడ్డి సోషల్ మీడియా ద్వారా పనుకున్న పంచుకున్నారు. మరోవైపు మన శంకర వరప్రసాద్‌గారు చిత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్(Success Celebrations) జనవరి 25న సాయింత్రం 5గంటలకు హైద్రాబాద్ లో జరగనుంది. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటుగా హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతార కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

