బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ దర్శకుడుగా మారనున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘క్రిష్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. క్రిష్ ఫ్రాంచైజీలో ఇదివరకే మూడు చిత్రాలు వచ్చాయి. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 ఇప్పటికే విడుదలై భారీ విజయాలని సాధించగా.. నాలుగో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ తండ్రి, డైరెక్టర్ రాకేశ్ రోషన్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘క్రిష్ 4’ (Krish) సినిమాకు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. క్రిష్ ఫ్రాంచైజీలో మొదటి మూడు భాగాలుగా హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు తెరకెక్కనున్న క్రిష్ 4తో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని తెలియజేస్తూ.. హృతిక్ రోషన్ (Hrithik Roshan) తండ్రి రాకేష్ రోషన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇందులో “దుగ్గూ (హృతిక్ రోషన్) 25 ఏళ్ల కిందట నిన్ను నటుడిగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆదిత్య చోప్రా నేను ఇద్దరం కలిసి డైరెక్టర్ గా నిన్ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాం. డైరెక్టర్ గా నువ్వు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ‘క్రిష్ 4’ సినిమాకు నువ్వు దర్శకత్వం వహిస్తుండటం చాలా ఆనందంగా ఉంది.” అంటూ రాకేష్ రోషన్ రాసుకోచ్చారు. దీంతో బాలీవుడ్ నటీనటులతో పాటుగా సినీ ప్రముఖులు హృతిక్ రోషన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయనికొస్తే.. 2019లో చేసిన వార్ మూవీ సూపర్ హిట్ గా నిలువుగా తర్వాత వచ్చిన విక్రమ్ వేదా, ఫైటర్ సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని తర్వాత క్రిష్ 4ని హృతిక్ రోషన్ చేయబోతున్నాడు.

