బాలీవుడ్ కు మంచి రోజులు వచ్చినట్లే అని చెప్పాలి. వరుస హిట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తోంది.
ఇటీవల విడుదలైన బోర్డర్ 2 రెండవ శనివారం నాడు 20.17 కోట్లు వసూలు చేసింది. 1997 లో విడుదలైన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ వచ్చిన బోర్డర్ 2 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23 న విడుదలయింది. బోర్డర్ చిత్రానికి దర్శకుడు జె పి దత్తా అయితే బోర్డర్ 2 చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకుడు.
వీక్ డేస్ లో వసూళ్లు తగ్గినప్పటికీ వీకెండ్ లో బోర్డర్ 2 (Border 2) జోరు తగ్గలేదు. ఇప్పటివరకు బోర్డర్ 2 చిత్రం ఇండియా లో 277.67 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాటికి బోర్డర్ 2 300 కోట్ల వసూళ్లను సాధించి అవకాశం ఉంది ప్రముఖ క్రిటిక్ తరన్ ఆదర్శ్ అన్నారు.

