SSMB29 ఈవెంట్ కు ప్రిపేర్ అవుతోన్న సుమ

by | Nov 13, 2025 | సినిమా

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం గత వారం నుండి సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతువున్ది.  ఈ శనివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీ లో జరగబోయే లాంచ్ ఈవెంట్ ఇండియాలోనే అతి పెద్ద సినిమా లాంచ్ ఈవెంట్ గా ఉండబోతోందని ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఈ ఈవెంట్ ను చరిత్రలో నిలిచిపోయేలా దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ ఈవెంట్ కు సంబందించిన ప్రేపరషన్ ఫోటో ను యాంకర్ సుమారు ఎక్స్ లో షేర్ చేశారు. లెట్స్ బిగిన్ ది షో అంటూ ఈ ఫోటో కు టాగ్ చేశారు. ఈ ఈవెంట్ కు తెలుగులో సుమ, హిందీలో ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ లు యాంకర్ లుగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కుంభ పాత్రధారి ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్, మందాకిని పాత్రధారి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు.  రామోజీ ఫిలిం సిటీ లో జరగబోయే ఈవెంట్ గురించి రాజమౌళి కూడా ఈ రోజు ఒక వీడియో విడుదల చేశారు.