మార్క్ శంకర్ తో హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్

by | Apr 13, 2025 | వార్తలు

మార్క్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ గారు, అన్నా లెజినోవా లు హైదరాబాద్ చేరుకున్నారు 

ఈ ఫోటో లో మార్క్ శంకర్ ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుని వస్తున్నారు

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతకు ముందు, సమ్మర్ క్యాంపు లో జరిగిన అగ్నిప్రమాదం లో, మార్క్ శంకర్ కళ్ళకు, చేతులకు గాయాలు అయినాయి. ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, డాక్టర్లు చికిత్స అందించారు

ఆ తరవాత, పవన్ కళ్యాణ్ తో పాటు, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ని చూడడానికి, చిరు దంపతులు  కూడా సింగపూర్ వెళ్లారు. మా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చాడు అని చిరంజీవి గారు ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. ఆ తరవాత ఇప్పుడు మార్క్ శంకర్ తో పాటు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రావడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికుల లో ధైర్యం వచ్చింది

https://twitter.com/sivacherry9/status/1911122671695499761