హిందీ సీనియర్ నటుడు సన్నీడియోల్, తెలుగు స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాట్’. ఈ సినిమాతో సన్నీడియోల్ తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఇందులో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించగా.. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా కసండ్రా కీలక పాత్రలో నటించారు. స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా అలరించింది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, అందించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాలు నడుమ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
జాట్ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.11.6 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో ఇండియా నుంచి రూ. 9.5 కోట్లు, ఓవర్సిస్ నుంచి రూ. 2.1 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.1 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నిలకడగా వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రానికి వీకెండ్ కలిసి వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏమేర వసూళ్లు సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జాట్ మూవీ ఏప్రిల్ 10న హిందీలో విడుదలవగా.. తెలుగు వర్షన్ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 17న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

