టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 17 న ‘ఓదేల 2’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పైగా ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు సాలిడ్ రేట్ కి అమ్ముడుపోయాయి. ఈ మూవీ మొదటి భాగం కంటే రెండో భాగమే భారీ మొత్తానికి అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోస్ సొంతం రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, థియేటర్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రీమియర్ అవ్వనుంది. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ గురించి కూడా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
ఇక పాన్ ఇండియా రేంజులో ఈ సినిమాను తెరకెక్కించడంతో, థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ థియేట్రికల్ డీల్ సుమారు రూ.10 కోట్లకు క్లోజ్ అవగా.. నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు ముగిసినట్లు సమాచారం. మొత్తానికి విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టిన ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ‘ఓదెల 2’ (Odela) సినిమా మొదటి భాగాన్ని మించి ఉండేలా భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించినట్లు నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందని ఈ సినిమాలో తమన్నా(Tamannah) పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

