ఇటీవల ‘పుష్ప2’ సినిమాతో కెరీర్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీతో జతకట్టాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్-అట్లీ సినిమాపై అధికారికంగా ప్రకటన విడుదల చేశారు చిత్ర బృందం. కోలీవుడ్ దిగ్గజ సినీ నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈరోజు ( ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ 43వ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలొనే క్రేజీ అనౌన్సమెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఊహకందని రీతిలో ఉంది.
ఈ వీడియోలో బన్నీ, అట్లీతో పాటుగా హాలీవుడ్ టెక్నీషియన్స్ కనిపించడం చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గ్లోబల్ స్టార్ నటి ప్రియాంక చోప్రా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 43వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి


