పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు

by | Apr 8, 2025 | వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది. మార్క్ శంకర్ కళ్ళకు, చేతులకు గాయాలు అయినాయి. ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు పూర్తి చేసి వెళుతున్నారు.  అల్లూరి సీతారామ జిల్లా పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ గారు సింగపూర్ వెళతారు