ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది
222 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 38 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ, రికెల్టన్ లు చెరో 17 పరుగులు చేసి అవుట్ అయ్యారు
అయితే విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్ లు మూడవ వికెట్ కు 41 పరుగులు జోడించిన తరవాత 22 పరుగులు చేసిన విల్ జాక్స్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తరవాత కొద్దిసేపటికే 28 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు
అయితే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య లు శివాలెత్తిపోయి ఆడారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ ఐదవ వికెట్ కు 89 పరుగులు జోడించారు. అయితే 6 పరుగుల తేడాతో వీరిద్దరూ అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ పరాజయం ఖాయమైంది. ఆర్సీబీ ఒఊపిరి పీల్చుకుంది
వీరిద్దరూ అవుట్ అయ్యాక, చివరి 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై ఇండియన్స్. ఆఖరి ఓవర్లో క్రునాల్ పాండ్య 6 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు
ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది ముంబై ఇండియన్స్
చివరకు ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 9 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసి విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లలో క్రునాల్ పాండ్య నాలుగు వికెట్లు తీసుకోగా, యాష్ దయాల్, హేజిల్ ఉడ్ లు రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ కీలకమైన తిలక్ వర్మ వికెట్ తీశారు
అంతకు ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆరంభంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ ను కోల్పోయింది
అయితే వన్ డౌన్ లో వచ్చిన పడిక్కల్, మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ తో కలిసి రెండవ వికెట్ కు 91 పరుగులు జోడించారు
22 బంతుల్లో 37 పరుగులు చేసిన పడిక్కల్ అవుట్ అయ్యాక వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ తో కలిసి విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డు ని పరిగెత్తించాడు. వీరిద్దరూ మూడవ వికెట్ కు 48 పరుగులు జోడించారు. 42 బంతుల్లో 67 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక వచ్చిన లివింగ్ స్టోన్ డక్ అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన జితేష్ శర్మ తో జత కలిసిన కెప్టెన్ రజత్ పటిదార్ ఐదవ వికెట్ కు 69 పరుగులు జోడించి జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించారు
పటిదార్ 32 బంతుల్లో 64 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ కు 19 వ ఓవర్ ఆఖరి బంతికి బౌల్ట్ తెర దించాడు. జితేష్ శర్మ 19 బంతుల్లో, నాలుగు సిక్సర్లు ,రెండు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్య లు రెండేసి వికెట్లు తీయగా, విగ్నేష్ పుతూర్ ఒక వికెట్ తీశాడు.
వెన్ను నొప్పి గాయంతో 4 నెలల పాటు క్రికెట్ కు దూరమైనా ఇండియన్ స్టార్ పేసర్ బుమ్రా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 29 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అయితే ముంబై ఇండియన్స్ బౌలర్ల లో,, ఈ రోజు మ్యాచ్ లో సింగల్ డిజిట్ ఎకానమీ రేట్ ఉన్న ఏకైక బౌలర్ బుమ్రా

