221 పరుగుల భారీ స్కోర్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు

by | Apr 7, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆరంభంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ ను కోల్పోయింది

అయితే వన్ డౌన్ లో వచ్చిన పడిక్కల్, మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ తో కలిసి రెండవ వికెట్ కు 91 పరుగులు జోడించారు 

22 బంతుల్లో 37 పరుగులు చేసిన పడిక్కల్ అవుట్ అయ్యాక వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ తో కలిసి విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డు ని పరిగెత్తించాడు. వీరిద్దరూ మూడవ వికెట్ కు 48 పరుగులు జోడించారు. 42 బంతుల్లో 67 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక వచ్చిన లివింగ్ స్టోన్  డక్ అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన జితేష్ శర్మ తో జత కలిసిన కెప్టెన్ రజత్ పటిదార్ ఐదవ వికెట్ కు 69 పరుగులు జోడించి జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించారు

పటిదార్ 32 బంతుల్లో 64 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ కు 19 వ ఓవర్ ఆఖరి బంతికి బౌల్ట్ తెర దించాడు. జితేష్ శర్మ 19 బంతుల్లో, నాలుగు సిక్సర్లు ,రెండు ఫోర్ల  సాయంతో  40 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. పటిదార్, జితేష్ శర్మ – వీరిద్దరూ 19 బంతుల్లో 50 పరుగులు చేశారు

చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్య లు రెండేసి వికెట్లు తీయగా, విగ్నేష్ పుతూర్ ఒక వికెట్ తీశాడు.

వెన్ను నొప్పి గాయంతో 4 నెలల పాటు క్రికెట్ కు దూరమైనా ఇండియన్ స్టార్ పేసర్ బుమ్రా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 29 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అయితే ముంబై ఇండియన్స్ బౌలర్ల లో,, ఈ రోజు మ్యాచ్ లో  సింగల్ డిజిట్ ఎకానమీ రేట్ ఉన్న ఏకైక బౌలర్ బుమ్రా