జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు శాసన మండలి సభ్యునిగా బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
గత మార్చి లో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన శ్రీ కె. నాగబాబు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు సూచనలకు అనుగుణంగా బుధవారం శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
పార్టీ కి చేసిన సేవలకు గాను, ఎంపీ టికెట్ ను వదులుకున్న నాగబాబు ను జనసేన తరపున మండలికి పంపారు శ్రీ పవన్ కల్యాణ్ గారు
మండలిలో నాగబాబు ప్రజల కోసం తన గళాన్ని వినిపించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని నాగబాబు సద్వినియోగం చేసుకోవాలి. చిరంజీవి, పవన్ కల్యాణ్ అంత సక్సెస్ ని సినిమాలలో నాగ బాబు చూడలేదు. రాజకీయాలలో నాగబాబుకు, పవన్ కల్యాణ్ పునాది వేశారు. మండలి లో నాగబాబు తన వాక్కుని వినిపించాలి, పోరాడాలి, తన మార్క్ ముద్ర వేయాలి
ప్రమాణ స్వీకార అనంతరం నాగబాబు, ఆయన సతీమణి పద్మజ గారితో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు ని కలిసి శాలువా కప్పి బొకే ఇచ్చారు. చంద్రబాబు గారు కూడా నాగ బాబుని శాలువా కప్పి వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందచేశారు.



