‘మాస్‌ జాతర’ వాయిదా.. ప‌వ‌న్ కోసం రవితేజ త్యాగం!

by | Apr 1, 2025 | సినిమా

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘మాస్‌ జాతర’ ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌‌లైన్‌‌. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నరన్న సంగతి తెలిసిందే. ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజకు (Ravi Teja) జోడిగా శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ కొంచెం ఆలస్యం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ న‌టించిన ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం మార్చి 28న విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా, కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.

అయితే ఉగాది రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి (Pawan Kalyan) సంబంధించి ప్ర‌త్యేక పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ మే 9న హ‌రి హ‌ర వీర‌మల్లు రిలీజ్ కాబోతుంద‌ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడకుండా మాస్ జాతర (Maas Jathara) చిత్రాన్ని జూలైకి వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ‘మ్యాడ్‌ స్వ్కేర్‌’ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)అనుకున్న తేదీకే విడుదలైతే.. తమ సినిమాను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తామని నాగవంశీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర చిత్రాన్ని జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రవితేజ , రాజేంద్రప్రసాద్‌ తాతామనవళ్లుగా నటిస్తున్నారని సమాచారం. వారి కాంబినేషన్‌ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంటున్నారు.