ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
కోల్ కతా నైట్ రైడర్స్ 16.2 ఓవర్ల లో 116 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే రెండు పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. డి కాక్ ఒక పరుగు చేసి అవుట్ అవగా, సునీల్ నరైన్ డక్ అవుట్ అయ్యాడు
ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ రహానే దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టి నా 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
26 పరుగులు చేసిన రఘువంశి కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. కోల్ కతా నైట్ రైడర్స్ స్కోర్ వంద పరుగులు దాటింది అంటే అది చివర్లో రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడి చేసిన 22 పరుగులు (12 బంతుల్లో) వలన మాత్రమే.
సూపర్ హిట్టర్ లు రింకు సింగ్ 17 పరుగులు, మనీష్ పాండే 19 పరుగులు, రస్సెల్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు
ముంబై ఇండియన్స్ లో ఆరంగేట్ర బౌలర్ అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీయగా, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. బౌల్ట్, విగ్నేష్ పుతూర్, హార్దిక్ పాండ్య, సాంట్నర్ లు తలా ఒక వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బౌలింగ్ చేసిన అందరికి వికెట్లు

