పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి క్రేజీ అప్డేట్ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అందించారు. ఆదివారం ఉగాది పండుగా వేడుకలలో పాల్గోన్న సందీప్ రెడ్డి వంగాను యాంకర్ స్పిరిట్ అప్డేట్ చెప్పండి అని అడగ్గా.. సందీప్ స్పిరిట్ మూవీ షూటింగ్‌ను మెక్సికోలో జరుపనున్నట్లు ప్రకటించాడు.
ఈ షెడ్యూల్ లో ప్రభాస్ (Prabhas) తో పాటుగా ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు
ఇంతకంటే ఏం చెప్పలేమని తెలిపాడు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ‘స్పిరిట్’ (Spirit) మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఏప్రిల్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆరునెలల్లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ (Raja Saab) , మూవీ హను రాగవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ” (Fouji) సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఏప్రిల్ లోనే ‘స్పిరిట్’ మూవీ సెట్స్ లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ మూవీకి హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.

