టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanti) పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు.
ఈ క్రమంలోనే మార్చి 31న ఈ సినిమా నుంచి ‘నాయాల్ది’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగ్ కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) వేసే స్టెప్పులు, అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇదిలాఉంటే.. ఈ సినిమా విడుదలకు ముందే సాలిడ్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆంధ్రలో రూ.15 కోట్లకి పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం సీడెడ్ నుంచే రూ.5 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.

