పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’, మూవీ హను రాగవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ” సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ‘స్పిరిట్’ (Spirit) మూవీ సెట్స్ లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది రోజున ఈ సినిమాను ప్రారంభించాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్, మ్యూజిక్ వర్క్స్ తో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా వెంటనే షూటింగ్ ప్రారంభించాలని భావించిన సందీప్ రెడ్డి ఉగాదికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాల చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకోవడంతో ‘స్పిరిట్’ చిత్రానికి వరుసగా కాల్షీట్స్ ఇవ్వాలని ప్రభాస్ (Prabhas) కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, స్పిరిట్ మూవీకి హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.

