టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఇటీవల ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద్రాబాద్ లో నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సోదరుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్న కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ రానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లయితే సినిమాకు మంచి హైప్ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ వేడుకకు ఎన్టీఆర్ (NTR) రానుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్లుగా మేకర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ తో ‘వార్ 2’ చేస్తుండగా.. తెలుగులో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగెన్’ చిత్రాన్ని చేస్తున్నాడు.
కాగా, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun S/o Vijayanathi) సినిమా విషయానికొస్తే.. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

