యూకే లో ఫ్యాన్ మీట్ కు కొంత మంది డబ్బులు వసూలు చేశారని మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు
ప్రియమైన అభిమానులారా, నన్ను కలవడానికి మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతలు నా మనసును కదిలించాయి. అయితే కొంత మంది ఫ్యాన్ మీట్ కు డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ప్రవర్తనను నేను ఖండిస్తున్నాను. ఇలాంటి పనులను నేను ఎప్పుడు ప్రోత్సహించను. ఎవరిదగ్గర నుండి అయినా డబ్బు వసూలు చేస్తే తిరిగి మీకు చెల్లించబడుతుంది
నాకు, నా అభిమానులకు మధ్య ప్రేమానుబంధాలు వెలకట్టలేనివి. మన మధ్య బంధాన్ని ఎవరు, ఏ రకంగానూ డబ్బుతో ముడిపెట్టలేరు. మన కలయిక స్వచంగా ఎటువంటి ప్రలోభాలకు లోబడని విధంగా ఉండాలి
అంతకు ముందు, చిరంజీవికి (Chiranjeevi) యూకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బ్రిటన్ పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తో పాటుగా రాజకీయ ప్రముఖులు, సినీతారలు, అభిమానులు పాల్గొన్నారు
ఇక చిరంజీవి నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా విశేష సేవలందించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల నట ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ ఇతర దక్షిణాది చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. ఇక సినిమాల విషయనికొస్తే.. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా యువ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Viswambhara) . సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

