కేవలం 8 రోజుల కోసం 2024 జూన్ 5 న అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ లు కొన్ని సాంకేతిక కారణాల వలన ఉండి పోవాల్సివచ్చింది
9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమ గాని విల్మోర్ లు. ఈ రోజు అంతరిక్షం లో ఉన్న వ్యోమగాములను స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ ద్వారా భూమి మీదకు తీసుకు వచ్చారు. వీరు భూమి మీదకు రావడానికి 18 గంటలు పట్టింది. ఈ తెల్లవారు జామున ఉదయం మూడు గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల మీద స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ ల్యాండ్ అయ్యింది. రెస్క్యూ టీం వీరిని సేఫ్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నాసా లైవ్ వీడియో చూడండి
లాండింగ్ తరవాత వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. వీరిని 3 నుండి 12 నెలలపాటు మానిటర్ చేస్తారు. 9 నెలలు గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉన్న వీరిని తిరిగి గురుత్వాకర్షణ శక్తి ఉన్న భూమి మీద ఉండడానికి కావలసినట్టుగా శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తారు

