ఫస్ట్​ సైన్స్ ఫిక్షన్ మూవీ రీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

by | Mar 18, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369). 1991లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ ఫస్ట్ ఇండియన్ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని, బాలయ్య (Bala Krishna) గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు. ఇందులో బాలయ్య సరసన మోహిని హీరోయిన్ గా నటించగా.. సిల్క్ స్మిత, అమ్రిష్ పురి, టినూ ఆనంద్, మాస్టర్ తరుణ్, జేవీ సోమయాజులు, సుత్తివేలు, లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీత స్వరాలు అందించారు. ఇందులో శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన.. జంధ్యాల సంభాషణలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా.. మరోసారి ‘ఆదిత్య 369’ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి 4K లో ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ వార్త తెలిసిన నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఐకానిక్ మూవీ ‘ఆదిత్య 369’ (Aditya 369) ను బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం బోయపాటి ‘అఖండ-2’ షూటింగ్‌లో బాలకృష్ణ (Bala Krishna) బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం విడుదలకానుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు