తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాంతో హీరో వెంకటేష్ కెరీర్లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. ఇందులో బుల్లిరాజు పాత్ర పోషించిన బాల నటుడు రేవంత్ నటనకు, డైలాగ్ డెలివరీకి కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వారి ఈలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లాయి. దీంతో అతడికి టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయట.ఈ నేపథ్యంలోనే ఇతడి రెమ్యునరేషన్ కి సంబంధించిన రూమర్స్ కొన్ని వినిపిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుల్లిరాజు (Bulli Raju) అలియాస్ రేవంత్ ఒక రోజు కాల్షీట్ కోసం ఏకంగా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్టులకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వలేదు. కాని సంక్రాంతికి వస్తున్నాం మూవీలో బుల్లిరాజు నటనకు మెచ్చిన మేకర్స్ కూడా అంత మొత్తం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి గ్రామానికి చెందిన రేవంత్ ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వలన వైరల్ అయిన ఇతడిని చూసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలాగే అనిల్ రావిపూడి-చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలోనూ బుల్లిరాజు నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

