నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన చిత్రం ’కల్కి'(Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిశారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘కల్కి 2898 AD’ సినిమా సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ రియాల్టీ షో చేయాతుండగా.. ఇది ముగిసిన వెంటనే ‘కల్కి 2’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటానని తెలిపారు. కల్కి మూవీ సీక్వెల్లో అమితాబ్ బచ్చన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, ఆయనపై కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండనుందని తెలుస్తోంది.
ఈ సీక్వెన్స్ లో కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ఇద్దరు కలిసి డెవిల్ యాస్కిన్‌గా నటించనున్న కమల్‌హాసన్‌పై చేసే పోరాటాలు మూవీలో హైలైట్‌గా ఉంటాయని తెలుస్తోంది. కల్కి 2 చిత్రీకరణలో అమితాబ్ బచ్చన్ మే రెండో వారం నుంచి జూన్ 15 వరకు జరగనున్న షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు సమాచారం.
గతంలో ‘కల్కి’ చిత్ర నిర్మాతలు స్వప్న- ప్రియాంక ఈ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘కల్కి’తో పాటే ఈ మూవీ సీక్వెల్‌కు సంబంధించి 35 శాతం షూట్ జరిగిందని తెలిపారు. ఇక కల్కి 2 సినిమాను కూడా వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ మరోసారి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

