ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana) . భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి కన్నడ ప్రముఖ నటుడు యశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీత పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) కనిపించనుంది. అలాగే రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామయణ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా, ఈ సినిమా తాజాగా ముంబైలో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
ఇందులో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్‌కపూర్, రావణ పాత్ర పోషిస్తున్న యష్‌లతో పాటుగా ఇతర తారాగణంపై ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను రెండు పార్టులుగా తీసుకురాబోతునట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను దీపావళి కానుకగా 2026లో అలాగే రెండో పార్టును దీపావళి కానుకగా 2027లో తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పుడు మొదటి భాగం షూటింగ్ పూర్తవగా.. వచ్చే నెలలో రెండో భాగానికి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ మొదటి భాగం రిలీజ్ అయే సమయానికి రెండో భాగం షూటింగ్ ని పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

