తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశం తరవాత తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ దేనికి సంకేతం. రాహుల్ గాంధీ కోర్ టీం లో పని చేసిన మీనాక్షి నటరాజన్ క్రమ శిక్షణకు, నిజాయితీకి మారు పేరు.
కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన తప్పుల తడకగా ఉందని ఏం ఎల్ సి తీన్మార్ మల్లన్న బహిరంగంగానే విమర్శించారు. బీసీ లను అణగతొక్కేలా ఈ కులగణన ఉందని తీవ్రస్థాయిలో వ్యతిరేక స్వరం వినిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై వ్యతిరేక స్వరం వినిపించిన టీన్ మార్ మల్లన్నకు పార్టీ షో కాజ్ నోటీసు కూడా పంపింది. షో కాజ్ నోటీసుకు సమాధానం కూడా తీన్మార్ మల్లన్న ఇవ్వలేదు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ వచ్చాక తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. పార్టీ కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు
కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి కులానికో, మతానికో సంబంధించింది కాదు. ఒక వేళ కులగణనలో ఏమైనా సమస్యలు ఉంటె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళాలి కానీ బహిరంగ విమర్శలు చేయడం సరి కాదు. రేవంత్ రెడ్డి మంచి మైక్ లో చెప్పండి. చెడు చెవిలో చెప్పమని నిన్న మీటింగ్ లో చెప్పారు
ఏ ఐ సి సి మరియు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు
అంతకు ముందు కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్న మీనాక్షి నటరాజన్ కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయి. పదవులు వచ్చిన వారందరూ కష్టపడి పని చేయాలనీ క్లాస్ పీకారు. ఫ్లెక్సీలు, ఫొటోలతో ఎన్నికలలో గెలవరు. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకమై ఉండాలి. నామినేటెడ్ పదవులను త్వరలో భర్తీ చేయాలనీ, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు
ఢిల్లీ లో ఘోర పరాజయం తరవాత కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో అధికారం నిలుపుకోవడం పై దృష్టి సారిస్తోంది.
అందుకనే రాహుల్ గాంధీ కోర్ టీం మెంబర్ అయినా మీనాక్షి నటరాజన్ ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గా నియమించారు
మీనాక్షి నటరాజన్ నియామకం వెనుక రేవంత్ రెడ్డి దూకుడుకు అడ్డు కట్ట వేయడం. ఇక్కడి వ్యవహారాలపై రాహుల్ గాంధీ కి నివేదికలు ఇవ్వడం వంటి అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి

