దక్షిణాదికి చెందిన పాన్ ఇండియా డైరెక్టర్ లు శంకర్, రాజ మౌళి. అసలు దక్షిణాది సినిమాలను నార్త్ ఇండియన్స్ కి చేరువ చేసిన మొదటి దర్శకుడు శంకర్. ఇప్పుడు తెలుగు సినిమా ని ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకు వెళ్లిన దర్శకుడు రాజ మౌళి.
ఈ ఇద్దరు దర్శకులు తమ తమ కీలక ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి చెప్పుకొచ్చారు. రాజమౌళి కి మహాభారతం తీయాలనే ఆసక్తి ఉంది. అదేవిధం గా, శంకర్ కి బయోపిక్ తీస్తే రజనికాంత్ బయోపిక్ తీయాలని ఉంది. వీళ్లిద్దరు త్వరలో ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్ ని తెర మీదకు తీసుకు రావాలని ఆశిద్దాం
ప్రస్తుతం జక్కన మహేష్ బాబు తో ఇంటర్నేషనల్ సినిమా కి శ్రీకారం చుట్టాడు. దర్శకుడు శంకర్, రామ్ చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ ఈ నెల 10 న విడుదల కాబోతోంది

