భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో మూడవ రోజు కడపటి వార్తలందేసరికి భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్ల నష్ఠానికి 358 పరుగులు చేసింది. ప్రస్తుతం, వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు
21 ఏళ్ళ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు.
7 వికెట్ల నష్టానికి 221 పరుగులతో ఉన్న భారత జట్టును నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వీరోచితంగా పోరాడి ఫాలో ఆన్ తప్పించడమే కాకుండా భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
వాషింగ్టన్ సుందర్ కేవలం ఒక బౌండరీతో 162 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసి నాథన్ లియోన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి మొదటి నుంచి పట్టుదలతో ఆడి 176 బంతుల్లో 105 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు.
భారత జట్టుకు భావి భారత ఆశా కిరణంగా నితీష్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నాడు. అద్భుతమైన షాట్ సెలక్షన్, సూపర్ గుడ్ ఫుట్ వర్క్ తో చూడముచ్చటైన షాట్లతో ఆడిన నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ ఆసాంతం అలరించింది అని చెప్పవచ్చు
ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి, ఆస్ట్రేలియా లో సెంచరీ చేసిన మూడవ యంగెస్ట్ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత స్థానం నితీష్ కుమార్ రెడ్డి
భారత జట్టు ప్రస్తుతానికి 116 పరుగుల వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు అల్ అవుట్ అయ్యిన విషయం తెలిసిందే
సిరీస్ ఆసాంతం అద్భుతం గా ఆడుతూ ఈ రోజు తన తొలి సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి కంగ్రాట్యులేషన్స్

