ఆంద్రప్రదేశ్ లో పాలిటిక్స్ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం ఒకవైపు కూటమి పాలనలో అభివృద్ధి వైపు నడుస్తున్నా, మరోవవైపు ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు సిఎం ఎవరు అనే చర్చలు నడుస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధనేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అయినా సరే కింగ్ ప్లేస్ లోకి వెళ్తాడా.., లేదా కింగ్ మేకర్ గానే మిగిలిపోతాడా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అసలు ఎపికి సిఎం అయ్యే అర్హత ఎవరికి ఉంది.. ఎవరు వస్తే అభివృద్ది అనేది ముందుకు వెళ్తుంది అనే విషయాల గురించి ఒకసారి విశ్లేషిద్దాం
పవన్ కళ్యాణ్ పార్టీ స్ధాపనకంటే ముందే తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్త అయ్యాడు. ఆ తర్వాత జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లో ఘోర ఓటమిని ఎదుర్కున్నాడు. కేవలం ఒకే ఒక్క సీటు మాత్రం గెలిచాడు. అది కూడా నిలవలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో బిజెపితో, తెలుగుదేశంతో కలిసి కూటమితో అడుగుముందుకేశాడు. పోటీ చేసిన చోటల్లా గెలిచాడు. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. దీనికి ప్రధానమైన కారణం ఓట్లు చీలిక లేకపోవడం అని విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా తిరుగులేని ఆధిపత్యాన్ని జనసేన చూపించింది. దీనికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి మర్యాదపూర్వకంగా మంత్రి పదవులు, తనకి డిప్యూటీ సిఎం పదవి కట్టపెట్టారు. అయితే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇది కేవలం డిప్యూటీ సిఎం పదవి మాత్రమే.. దీనికి అదికారాలు ఏమీ ఉండవు. మంత్రిగానే పవన్ కళ్యాణ్ తన శాఖలకి పనిచేస్తారు. అక్కడే హోదా అనేది ఉంటుంది. ఇది కేవలం పేరుకి మాత్రమే. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తర్వాత సిఎం అవుతాడా , లేదా నారా లోకేష్ కి ఆ బాధ్యతలు అప్పజెప్తారా అనేది ఆసక్తిగా మారింది.
2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూసింది తెలుగుదేశం పార్టీ. ఇందులో లోకేష్ కూడా తన నియోజవర్గంలో గెలవలేకపోయాడు. కానీ, అదే చోట మంగళగిరిలో తన సత్తాని చాటుకుని అత్యధిక మెజార్టీతో గెలిచాడు. ఆ తర్వాత మంత్రి వర్గంలో ఐటి రంగంలో తన స్టామినాని చూపిస్తున్నాడు. చంద్రబాబు వారసుడిగా జనాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు లోకేష్.. పప్పు అన్న నోళ్లే ఇప్పుడు నిప్పు అంటున్నాయి. నువ్వు తోపు అంటున్నాయ్.. ఈ నేపత్యంలో తర్వాత సిఎం అవ్వడానికి లోకేష్ అన్నివిధాలుగా అర్హుడు అనే తెలుగు దేశం పార్టీ నేతలు అంటున్నారు. ఎందుకంటే., తమ సొంతపార్టీ నుంచే నాయకుడు ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది. వేరే పార్టీ నుంచీ వచ్చి సిఎం అయినా, లేదంటే పెత్తనం చెలాయించాలని చూసినా ఎవరూ అంతగా ఇష్టపడరు. అప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువ తెలుగుదేశం పార్టీకే ఉన్నారు కనుక కథ అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. పార్టీలో అంతర్యుద్ధానికి ఇది దారితీస్తుంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీలోనే కాదు, అటువైపు జనసేనలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వాళ్లు అడిగిన కేబినెట్ హోదా దక్కింది కాబట్టి చాలామంది మాట్లాడకుండా ఉంటున్నారు. ఒక్కచోట తేడా వచ్చినా కూడా జనసేన పార్టీలోనే పవర్ ఫుల్ వాయిస్ వినిపిస్తుంది. తమకి గౌరవంగా డిప్యూటీ సిఎం హోదాని ఇచ్చారని, తమ నాయకుడు తర్వాత సిఎం అవుతాడని చాలామంది ఇప్పటికీ భావిస్తున్నారు. అసలు మేటర్ ఏంటంటే., అంతవరకూ సీన్ వస్తే మాత్రం రాజకీయం ఎత్తుగడలు మారిపోతాయ్..
జనసేన పార్టీలో నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మాటనే వింటారు అందులో సందేహం లేదు. కానీ, తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే, అందులో చాలా సీనియర్ నేతలు, పార్టీకి కొన్ని యేళ్లుగా సర్వీస్ చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ పార్టీ టిక్కెట్ రాకపోయినా సరే పార్టీకోసమే , పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులు ఉన్నారు.పవన్ కళ్యాణ్ ని సిఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే వాళ్లు రెబల్స్ గా మారతారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పని చేయరు. వచ్చే ఎన్నికల్లో జనసేన బిజెపితో మాత్రమే పొత్తుపెట్టుకుని పోటీ చేస్తే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో కూడా బిజెపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాసం కూడా ఉంది. అప్పుడు పరిస్తితులని బట్టీ బిజెపీకి మద్దతు బాగా లభిస్తే ఖచ్చితంగా జనసేన కి మంచి భవష్యత్ ఉంటుంది. అప్పుడు పవన్ కల్యాణ్ సోలోగానే చక్రం తిప్పే ఛాన్స్ ఉంది. అలాంటిది తెలుగు దేశం పొత్తుతో సిఎం అవకాశం వచ్చినా కూడా వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నార్త్ లో పోలిటిక్స్ ని సైతం ప్రభావితం చేస్తున్నాడు. తను బిజెపీ తరపున ప్రచారం చేసి తన ఫ్యూచర్ ప్రణాళికలని ఇండైరెక్ట్ గానే చెప్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందనేది విశ్లేషకుల భావన. అంతేకాదు, బిజెపీతో పొత్తు అనేది జనసేన మైయిన్ ఎజెండా అయ్యింది. అందుకే పవన్ కళ్యాణ్ పై మోది అంత ప్రేమని చూపిస్తున్నారని కూడా అంటున్నారు.
లోకేషా… పవన్ కల్యాణా అనే సందేహం వచ్చినపుడు ఖచ్చితంగా పార్టీ వర్గాలు మాత్రం లోకేష్ వైపే మొగ్గుచూపిస్తాయి. చంద్రబాబు సైతం తన వారసుడ్ని పార్టీకి అధినేతని చేయాలనే చేస్తారు. లోకేష్ పవన్ ని అన్నా అన్నా అని పిలిచినా అది పేరుకి మాత్రమే కానీ పదవి కట్టబెట్టడానికి వచ్చేసరికి మాత్రం కుదరదనే చెప్తారు. ఈవిషయం పవన్ కల్యాణ్ కి సైతం తెలుసు. ప్రస్తుతం ఒకరి అవసరం మరొకరకి ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు ఓట్లు చీలకుండా ఉండేందుకే పెట్టుకున్నారు. పార్టీని నిలబెట్టుకున్నారు.చంద్రబాబు తర్వాత సిఎం ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం ఆలోచనలో పెట్టుకోరు. మరి చూద్దాం… ఎపి పాలిటిక్ల్స్ లో ఎలాంటి మార్పులు వస్తాయో..,

