గులాబీ కోటలో మంటలు.. కవిత అసలు టార్గెట్ ఆ ఇద్దరే!

by | Feb 24, 2026 | రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం! కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన సొంత పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (Telangana Praja Jagruthi) తో రాజకీయ రణరంగంలోకి దిగుతున్నారు. నిన్నటి దాకా ఒకే కుటుంబం, ఒకే పార్టీ, ఒకే ఎజెండా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఇంట్లోనే కుంపటి రగులుకుంది. బాణం ఎక్కుపెట్టింది ఎవరో కాదు.. సాక్షాత్తూ కేసీఆర్ (KCR) గారాల పట్టి కల్వకుంట్ల కవిత. తెలంగాణ దశాబ్దాల చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం. కవిత అసలు లక్ష్యం ఏంటి? ఎవరిని టార్గెట్ చేస్తోంది? సిద్ధిపేట కోటలో పాగా వేసి ఎవరికి చెక్ పెట్టబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు సమాధానాలు వెతుకుదాం. ఒకప్పుడు బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అన్నంతగా ముడిపడిపోయిన పేరు ‘తెలంగాణ జాగృతి’. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను అస్త్రంగా మలచుకుని కవిత సరికొత్త రాజకీయ పార్టీకి పురుడు పోస్తున్నారు. పార్టీ పేరు కూడా డిసైడ్ అయిపోయింది. అదే “తెలంగాణ ప్రజా జాగృతి”. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నడుస్తోంది. ఎందుకీ పేరు? ఎందుకంటే ప్రజల్లోకి జాగృతి అనే పేరు బలంగా వెళ్లిపోయింది. దానికి ‘ప్రజా’ అనే పదం తగిలించి ఎమోషనల్ గా జనానికి కనెక్ట్ అయ్యేలా మాస్టర్ ప్లాన్ గీశారు కవిత. వచ్చే నెల అంటే మార్చిలోనే జెండా, అజెండా రెండూ ప్రజల ముందుకు రాబోతున్నాయి. జూన్ నెలలో అయితే ఏకంగా తెలంగాణ నలుమూలల నుంచి జనాన్ని రప్పించి ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.

కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్! కవిత టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే మీరు పొరబడినట్లే. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ (Congress) ను విమర్శిస్తూనే.. గత పదేళ్లు అధికారంలో ఉన్న తన సొంత పార్టీ, కన్న తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ (BRS) మీద, అందులో జరిగిన అవినీతి మీద కూడా బాంబులు పేల్చడానికి రెడీ అవుతున్నారు. తన సొంత బంధువులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు అయిన హరీశ్ రావు (Harish Rao) , సంతోష్ రావు (Santosh Rao) లే ఆమె ప్రైమ్ టార్గెట్! ఇది సామాన్యమైన వ్యూహం కాదు. ఏకంగా సింహం గుహలోకి వెళ్లి వేటాడే వ్యూహం. మీకందరికీ తెలుసు, కవిత ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో ప్రకటించారు. ఒకటి బోధన్, రెండు.. సిద్ధిపేట! అవును, ఉమ్మడి మెదక్ జిల్లా ముద్దు బిడ్డ, ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు కంచుకోట అయిన సిద్ధిపేటలో కవిత కాలు మోపబోతున్నారు. ఏ రోజైతే కవిత సిద్ధిపేట పేరు చెప్పారో.. గులాబీ బాస్ క్యాంప్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్రబుల్ షూటర్ కే ట్రబుల్స్ తెచ్చేలా కవిత వ్యూహ రచన చేస్తున్నారు. మొదటి నుంచి హరీశ్ రావు, సంతోష్ రావుల వల్లనే తనకు పార్టీలో, ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని కవిత రగిలిపోతున్నారు.

ఇప్పుడు ఏకంగా సిద్ధిపేట బరిలోకి దిగి, హరీశ్ రావును సొంత ఇలాకాలోనే ఓడించి తన సత్తా ఏంటో, తన పవర్ ఏంటో చూపించాలన్నది కవిత ఆశయం. ఇక బోధన్ అంటారా.. అది తన అత్తగారి ప్రాంతం కాబట్టి, అక్కడ ఉన్న లోకల్ సెంటిమెంట్ తనకు బ్రహ్మరథం పడుతుందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. మరి ఇదంతా చూసి బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంటుందా? మున్సిపల్ ఎన్నికల్లో కవిత వర్గం వల్ల పెద్దగా డ్యామేజ్ జరగలేదని పైకి కాలర్ ఎగరేస్తున్న గులాబీ నేతలు.. లోపల మాత్రం భయంతో వణికిపోతున్నారు. కవిత గనక వేరు కుంపటి పెడితే.. కారు పార్టీకి పడే ఓట్లలో భారీగా చీలిక వస్తుందని, అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని కేసీఆర్ కు కూడా తెలుసు. ఆ నష్టాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? కవిత వేగాన్ని ఎలా అడ్డుకోవాలి? అని ఇప్పటి నుంచే ఫామ్ హౌస్ లో వ్యూహాలు రచిస్తున్నారని మనకు అందుతున్న పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం. కానీ ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు రాబోయే రోజుల్లో రసవత్తరంగా మారబోతున్నాయి. బాబాయ్ మీద కూతురు చేస్తున్న ఈ రాజకీయ యుద్ధంలో గెలుపెవరిది? ఈ కుటుంబ పోరులో లాభపడేది కాంగ్రెస్సా లేక బీజేపీనా? ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.