పెద్ది కెప్టెన్‌కు చెర్రీ విషెస్.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారా?

by | Feb 15, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) . బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) , సుకుమార్‌ రైటింగ్స్‌ (Sukumar Writings) సమర్పణలో, వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందించ‌బోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక పెద్ది చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఫిబ్రవరి 15న దర్శకుడు బుచ్చిబాబు సాన పుట్టినరోజు (Happy Birthday) సందర్భంగా రామ్ చరణ్ తన డైరెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే పెద్ది మూవీ షూటింగ్‌లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్, బుచ్చిబాబు పక్కపక్కనే కూర్చోగా, ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన శరీరకృతిని పూర్తిగా మార్చేసి గ్రామీణ క్రీడాకారుడి పాత్రకు తగ్గట్టుగా నెవర్ బిఫోర్ అవతార్‌లోకి మారారు. తలకు రుమాలు చుట్టుకొని, చేతిలో కర్రతో కనిపించారు. ఇక రామ్ చరణ్ ఇలా ట్వీట్ చేశారు.. “పెద్ది కెప్టెన్‌ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సెట్‌లో మీ నిబద్ధత, విజన్, కష్టపడే తత్వం, మీ టేకింగ్ స్టైల్, మీరు కథ చెప్పే విధానం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో మీరొక గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్, మనం ఇద్దరం కలిసి మరిన్ని గొప్ప కథలను సృష్టిద్దాం.. ఈ ఏడాది మీ కృషికి తగిన గుర్తింపు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..” అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు కూడా బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈరోజు పెద్ది సెకండ్ సింగిల్ లేదా మూవీ గ్లింప్స్‌ అప్డేట్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సానా 2021లో ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. తెలుగులో తొలి సినిమాతోనే వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన దర్శకుడిగా బుచ్చిబాబు సానా రికార్డ్ సాధించారు.