టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil) నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’ (Swayambhu). డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి (Bharath Krishnamachari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిఖిల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్ (Samyukta Menon) , నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమా కావడంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో మేకర్స్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్‌లో (Teaser) చూపించిన విజువల్స్, నిఖిల్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, వార్ సీక్వెన్స్‌లతో కూడిన ఈ టీజర్ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా యుద్ధం నిలువదు కృష్ణా (Krishna) అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో, త్రీడీ ఫార్మాట్‌లో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ను అందిస్తోంది. ఇందులో సంయుక్త యోధురాలిగా కనిపిస్తుండగా, నభా నటేష్ రాణి పాత్రలో నటించనుంది. ఈ టీజర్‌లో రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోస్థాయికి తీసుకెళ్లింది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లా ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో వేసవి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


