‘ధురంధర్ 2’ ఎఫెక్ట్.. ఆ టాలీవుడ్ మూవీ పోస్ట్ పోన్!

by | Feb 3, 2026 | సినిమా

గతేడాది డిసెంబరులో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన బాలీవుడ్ మూవీ ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి అగ్ర నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ధురంధర్’ కు కొనసాగింపుగా వస్తున్న ‘ధురంధర్ 2’ టీజర్‌ (Teaser) ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చిలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. వీటిలో టాలీవుడ్ యువ కథానాయకుడు అడివి శేష్ (Adavi Seshu) నటిస్తున్న ‘డెకాయిట్’ (Decoit) మూవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించారు.

అయితే అదే రోజు ధురంధర్ 2 (Durandhar 2) మూవీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుండటంతో ఇప్పుడు ‘డెకాయిట్’ (Decoit) చిత్రాన్ని వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ‘డెకాయిట్‌’ మూవీలో మృణాళ్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయికగా నటిస్తుండగా.. షానియల్‌ డియో దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శక, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kasyap) కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో (Bheems) సంగీతం అందిస్తున్నారు.