‘కాంతార’తో (Kanthara_ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) , ‘కాంతార చాప్టర్-1’ (Kanthara Chapter 1) తర్వాత ఇప్పటివరకు కొత్త దర్శకత్వ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన కేవలం నటనపై మాత్రమే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా సినిమాల అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిషబ్‌శెట్టి ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో బ్లాక్‌బస్టర్ హిట్ ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ (Jai Hanuman) ఒకటికాగా, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా ఇంకొకటి. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందనుందని తెలుస్తోంది. ఇక ‘జై హనుమాన్’ చిత్రాన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ ఏడాది పూర్తిగా ఈ రెండు సినిమాల మీదే ఫోకస్ చేయాలని రిషబ్ శెట్టి (Rishab Shetty) ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే కొత్త చిత్రాలకు కూడా డేట్స్ ఇవ్వడంలేదని టాక్ నడుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించి రిషబ్ శెట్టి డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పెద్ద హీరోలు పారితోషికం ఏమి తీసుకోకుండా కేవలం లాభాల్లో మాత్రమే వాటా తీసుకుంటున్నారు. కానీ రిషబ్ శెట్టి మాత్రం ఒక్కో సినిమాకు కచ్చితంగా రూ.80 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం నిర్మాతలను విస్మయానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టిన రిషబ్ శెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలోనే తనదైన నటనతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నాడు.

