ఇండియా టుడే చేసిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వే (India Today Mood of The Nation Survey) ప్రకారం మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నే ప్రధాన మంత్రి అవుతారని స్పష్టం అవుతోంది. వరసగా నాలుగవ సారి ప్రధాన మంత్రిగా మోడీ అవుతారని సర్వే స్పష్టంగా చెపుతోంది
ఇండియా టుడే చేసిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వే ప్రకారం కూటమి 352 మంది ఎంపీ లను గెలుచుకునే అవకాశం ఉండగా, భాజపా సొంతంగా 287 మంది ఎంపీలను గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వే చెపుతోంది. ఇండియా కూటమి 182 మంది ఎంపీలను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్ 80 ఎంపీలను మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి ఉన్న ఎంపీలతో పోలిస్తే భాజపా కూటమి 28 మంది ఎంపీలను అదనంగా గెలుచుకునే అవకాశం ఉండగా, ఇండియా కూటమి 26 మంది ఎంపీలను కోల్పోయే అవకాశం ఉంది.
NDA కూటమికి, INDIA ఇండియా కూటమి కి వోట్ షేర్ లో 9% దాకా తేడా ఉంటుందని సర్వే చెపుతోంది. అంటే భాజపా ఎవరి మీద ఆధార పడకుండా స్వతంత్రంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నమాట.
అయోధ్యలో రామ మందిరం, ఆపరేషన్ సింధూర్, అభివృద్ధి, ముఖ్యంగా దేశ భద్రత కు సంబందించిన అంశాలలో మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలలో సానుకూలత ఉందని తెలుస్తోంది. మోడీ ప్రభావం వాళ్ళ దేశ ప్రజలలో భక్తి భావం పెరిగింది. హిందుత్వం పట్ల అవగాహన పెరిగింది. దేవాలయాలలో రద్దీ పెరుగుతోంది
అయితే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాల పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గనక లోక్ సభ ఎన్నికలు పెడితే తెలుగు దేశం కూటమి అత్యధిక మెజారిటీ తో గెలుస్తుందని మూడ్ అఫ్ ది నేషన్ సర్వే లో స్పష్టమైంది . తెలుగు దేశం (TDP) , జనసేన (Jana Sena) పార్టీ ల పట్ల, సూపర్ సిక్స్ పధకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రధాన బలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). మచ్చలేని నాయకుడు, సొంత డబ్బుతో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడం వంటి అంశాలు ప్రజలను ఆకర్షించాయి. కూటమితో పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు వైస్సార్సీపీ అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పవచ్చు
వైస్సార్సీపీ (YSRCP) ప్రధాన తలనొప్పి సొంత చెల్లెలు అయిన షర్మిల. వైస్సార్సీపీ ని ఎవరో ఓడించక్కర్లేదు. చెల్లెలు చాలు. స్వతహాగా కాంగ్రెస్ పార్టీ లక్షణం ఏంటంటే వాళ్ళను వల్లే ఓడించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ది భస్మాసుర హస్తం
తెలంగాణ లో భారాసా గ్రాఫ్ రోజు రోజు కి పడిపోతోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే లోక్ సభ ఎన్నికలలో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు అయినా కాంగ్రెస్, భాజాపా ల మధ్య ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు

