అల్లు అర్జున్-అట్లీ మూవీ.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్!

by | Jan 30, 2026 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటీనటుల విషయానికి వస్తే, అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ వ్యయంతో సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. AA22 x A6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అట్లీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అట్లీ త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ రానుందని తెలిపారు. అది అభిమానులతో పాటుగా సినీ ప్రియులను పూర్తిస్థాయిలో అలరిస్తుందని పేర్కొన్నారు. అలానే ఈ మూవీ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి మాట్లాడుతూ.. దీపిక నా లక్కీ ఛార్మ్ జవాన్ తర్వాత ఆమెతో చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో దీపికా మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు అని ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ సినిమాలో కేవలం దీపికా పదుకొణె (Deepika Padukone) మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన్న ఈసారి విలన్ లక్షణాలున్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పవర్‌ఫుల్ పాత్రలో మెరవనున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణతో (Ramya Krishna) పాటుగా కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.