విడుదల తేది: 30–01–2026
నటీనటులు: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, సురభి ప్రభావతి, రోహిణి నోని, గోపరాజు విజయ్, శివన్నారాయ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: దీపక్ యెరగరా
సంగీతం: జే క్రిష్
నిర్మాణ సంస్థ: ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వెర్స్ స్టూడియోస్
నిర్మాతలు: సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఆర్. సంజీవ్
కథ:
తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) , ఈషా రెబ్బా (Esha Rebba) జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanthi Shanthi Shanthi). ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ కలిసి నిర్మించారు. గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే హిలేరియస్ విలేజ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతాన్ని జై క్రిష్ సమకూర్చారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘జయ జయ జయ జయహే’ రీమేక్‌గా తెలుగులో ఈ చిత్రాన్ని రూపొందించారు. మాలయాళంలో కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన జయ జయ జయ జయహే సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ క్రమంలోనే ఈ సినిమా జనవరి 30న విడుదలైంది. మరి మాతృకతో పోలిస్తే ఇందులో కనిపించే కొత్త అంశాలు ఏంటి ? ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ.
చిన్ననాటి నుంచి భవిష్యత్ గురించి కలలు కంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలి అనుకునే అమ్మాయి ప్రశాంతి అలియాస్ శాంతి(ఈషా రెబ్బా) తను చదువుకునే కాలేజీలో జరిగిన ఒక సంఘటన కారణంగా చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లికి సిద్ధమవుతుంది. పెళ్లి తర్వాత శాంతిని చదివిస్తానని మాటిచ్చి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు చేపల వ్యాపారి ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) వస్తాడు. దీంతో శాంతి పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే పెళ్లయ్యాక భర్త అనే అహంకారంతో తన కోపాన్నంత భార్య శాంతి మీద చూపిస్తాడు ఓంకార్ నాయుడు. చిన్న గొడవలకు కూడా చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి ఏడుస్తూ ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని చెబుతారు. ఒకరోజు ఓంకార్ రాయుడిపై శాంతి తిరగబడుతుంది. తానూ చేయి చేసుకుంటుంది. అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి ? విడిపోవాలి అనుకున్నారా ? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా ? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆడపిల్లలు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా గౌరవం, స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిసి కూడా నేటికీ ఎంతోమంది అమ్మాయిలు వివక్షకు గురవుతున్నారు. శతాబ్దాలు మారుతున్నా లింగ వివక్ష మాత్రం మారడం లేదు అని ఆలోచింపజేసే కథ ఇది. ముఖ్యంగా ఇందులో శాంతి పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు ఎంతో స్పూర్తి దాయకం. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలే ఈ సినిమాలో కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలను వినోదాత్మకంగా చూపించారు. ఇలా ఫస్టాఫ్ అంతా ఆసక్తికరంగా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు. రాయుడు పాత్రలో తనదైన శైలిలో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్ర చాలా బలంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ అమ్మాయి పడే కష్టాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, రోహిణి నోని కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. క్రిష్ ఇచ్చిన పాటలు హుషారుగా వున్నాయి. నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. దీపక్ కెమరా వర్క్ డీసెంట్ గా వుంది. నిర్మాణ విలువలు రిచ్ వున్నాయి. గోదావరి బ్యాగ్ద్రాప్ లో తీసిన విజువల్స్ కలర్ ఫుల్ గా వుంటాయి. మొత్తంగా సాంకేతికంగా సినిమా పర్లేదనిపించింది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
నటీనటులు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్
క్లైమాక్స్


