విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లీశ్వరీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఈ క్రేజీ కాంబోలో పుల్ లెంగ్త్ సినిమా రాబోతుందని తెలిసిందే. హారిక హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsa Kutumbam) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ (Venkatehs) సరసన కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ‘హిట్ 3’, ‘తెలుసు కదా’ వంటి సినిమాలతో ఇప్పటికే తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు శ్రీనిధి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవగంగా జరుగుతుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ వేగంగా పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెల కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, సమ్మర్లోనే సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుండి ఈ ప్రాజెక్టులో వరుసగా సాంకేతిక మార్పులు తలెత్తుతున్నాయి. మొదట ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ సారథ్యంలో వేసిన ఇంటి సెట్ త్రివిక్రమ్‌కు నచ్చలేదట. దాంతో ఆయన స్థానంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ నేతృత్వంలో కొత్తగా సెట్ వేయించి షూటింగ్ మళ్లీ ప్రారంభించారు. అంతకుముందు కెమెరామెన్ విషయంలోనూ ఇలాంటి మార్పులే చేశారు. టెక్నికల్ కారణాలతో షూటింగ్ కొంత ఆలస్యమవుతున్నప్పటికీ, క్వాలిటీ అవుట్ పుట్ విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. అనుకున్న సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంతో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా వెంకీ – త్రివిక్రమ్ కాంబో ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

