భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్ లు మొదటి వికెట్ కు 100 పరుగులు జోడించి చక్కని శుభారంభాన్ని ఇచ్చారు. కాన్వే 23 బంతుల్లో 44 పరుగులు, సీఫెర్ట్ 36 బంతుల్లో 62 పరుగులు చేశారు. వన్ డౌన్ లో వచ్చిన రచిన్ రవీంద్ర రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఫిలిప్స్ 16 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఆపద్బాంధవుడు డరిల్ మిచెల్ 18 బంతుల్లో 39 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. చివరి వరుస ఆటగాళ్లు సాంట్నర్, ఫోల్క్స్, హెన్రీ లు ముగ్గురు కలిసి 15 బంతులు ఆడి 30 పరుగులు చేశారు
భారత జట్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఆర్షదీప్ సింగ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. బిష్ణోయ్, బుమ్రా లు చెరో ఒక వికెట్ తీశారు.
ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్ లు గెలిచి 5 టి 20 మ్యాచ్ ల సిరీస్ ను భారత జట్టు గెలుచుకుంది. భారత జట్టు 5-0 తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది

