ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురసర్కాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, క్రీడలు తదితర రంగాల నుంచి అత్యుత్తమ సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం ఎంపిక చేసింది. మొత్తంగా 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అలానే 13 మందికి పద్మభూషణ్ వరించాయి. 5 గురికి పద్మవిభూషణ్ పురస్కారులు దక్కాయి. బాలీవుడ్ చిత్రసీమకు విశేష సేవలందించిన దివంగత నట దిగ్గజం ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. అలాగే మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టిని పద్మభూషణ్ పురస్కారం దక్కింది. తెలుగు చిత్రసీమ నుంచి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా సీనియర్ నటుడు మురళీ మోహన్ కు పద్మశ్రీలు పురస్కారాలు వరించాయి. వీరితో పాటుగా తమిళ స్టార్ హీరో మాధవన్కి కూడా పద్మ శ్రీ పురస్కారం దక్కింది. పద్మశ్రీ అవార్డులు వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉండడం విశేషం. ఏపీకి చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఏడుగురు ఉన్నారు.
పద్మశ్రీ వచ్చిన తెలుగు వ్యక్తులు
- గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)
- మాగంటి మురళీమోహన్ (ఆంధ్రప్రదేశ్)
- చంద్రమౌళి గద్దమనుగు (తెలంగాణ)
- దీపికా రెడ్డి ( తెలంగాణ)
- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)
- వెంపటి కుటుంబ శాస్త్రి (ఆంధ్రప్రదేశ్)
- గూడూరు వెంకట్ రావు (తెలంగాణ)
- కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (తెలంగాణ)
- కుమారస్వామి తంగరాజ్ (తెలంగాణ)
- పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (తెలంగాణ)
- రామారెడ్డి మామిడి (తెలంగాణ)


