ప‌వ‌న్ – సురేందర్ రెడ్డి మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే.!

by | Jan 22, 2026 | సినిమా

తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా సురేందర్ రెడ్డి (Surendar Reddy) కి ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. అతనొక్కడే సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఊస‌ర‌వెల్లి, అతిథి, కిక్-2 లాంటి ఫ్లాప్‌లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత సురేందర్‌ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 32వ చిత్రంగా తెరకెక్కనుంది.

పవన్‌ను ఇంతకుముందు చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అయితే ఈ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచే ప్రారంభం కానుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లోకి మారిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక పవర్‌ఫుల్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని జైత్ర రామ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ అప్‌డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహం పెరిగిందని చెప్పవచ్చు.