‘డ్రాగన్’ కోసం రంగంలోకి ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్!

by | Jan 22, 2026 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ (Salaar)) మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ (Dragon) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ‘ఆర్ఆర్ఆర్’ ఫేమ్ ఒలివియా మారిస్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ (NTR) పాత్రను ప్రేమించే రాకుమారి పాత్రలో ఒలీవియా మారిస్ అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఈ క్రమంలోనే ‘డ్రాగన్’ సినిమాలోనూ అదే రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ ను ఈ మధ్య తెరకెక్కించారు మేకర్స్. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో తప్పకుండా ఎన్టీఆర్ భారీ హిట్ కొడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.