‘పెద్ది’ ఫస్టాఫ్‌ లాక్‌.. ఇక టెన్షన్ లేనట్టే!

by | Jan 22, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది (Peddi)’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ‘పెద్ది’ ఫస్టాఫ్ ని చిత్రబృందం లాక్ చేసేసినట్టు తెలుస్తోంది. ‘పెద్ది’ (Peddi) ఫస్టాఫ్ ని లాక్ చేసిన మేకర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు పంపించారట. దింతో ఈ మూవీ రీ రికార్డింగ్ పనులు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు మొదలైనట్టు తెలుస్తోంది.

అలాగే తదుపరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించేందుకు చిత్రబృందం యూరప్‌ వెళ్లనుంది. అక్కడ జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుందని తెలుస్తోంది. యూరప్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు రామ్‌చరణ్‌, జాన్వీలపై ఓ సాంగ్ కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. కాగా, మార్చి 27న సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న టైమ్‌కు రావడం కష్టమే అంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో పోస్టులు కనిపించాయి. ఇప్పుడు ఈ మూవీ ఫస్టాఫ్ లాక్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి