టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి (Varanasi) . భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకచోప్రా (Priyanka Chopra) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ మూవీ టైటిల్‌తో పాటుగా 2027లో సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
నిజానికి రాజమౌళి (Rajamouli) సినిమాలు అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యమవుతాయి. ఈ క్రమంలోనే అసలు 2027లో ఈ సినిమా విడుదల అవుతుందా అనే సందేహాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మరోసారి విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ‘వారణాసి’ సినిమా 2027లోనే విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. దింతో ఇటు అభిమానులు అటు సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2027 శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇక ‘వారణాసి’ (Varanasi) మూవీలో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తుండగా.. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

