భాగ్యనగరంలో.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ యాక్షన్ సీక్వెన్స్

by | Jan 19, 2026 | సినిమా

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్'(Dragon) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ భాగమవుతున్నారనే వార్తలు మరింత అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన నాటినుంచి అభిమానులు దీని అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను నిర్మాతలు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్ లోనే రెండు వారాల పాటుగా షూటింగ్ జరగనుందట. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రల మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు హీరో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ పాత్ర మీద ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారని తెలుస్తోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. సినిమాలో ఈ సీక్వెన్స్‌ మేజర్‌ హైలెట్‌గా ఉండబోతోందని టీమ్‌ చెబుతోంది. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.